Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి పనులు చేసే వారందరికీ సార్వజనీన బడ్జెట్ వేతనాలు చెల్లించాలి
- వ్యకాస జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టమనేది సార్వజనీన కార్యక్రమని, మొత్తంగా చట్టం అమలుకు బడ్జెట్ నిబందనలు రూపొందించారని, అటువంటప్పుడు సామాజిక వర్గీకరణల ద్వారా వివిధ కేటాయింపులు జరిపే విధానాన్ని ప్రవేశ పెట్టాలని, చట్టానికి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తక్షణమే ఈ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని వ్యకాస, కేవీపీఎస్ ప్రతినిధి బృంధం శనివారం కలెక్టర్‌ని కిలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లడుతూ... ఈ చట్టం పేదల సంక్షేమం కోసం అనేక పోరాటాల ఫలితంగా వచ్చిందని, అటువంటప్పుడు పార్లమెంటులో గాని, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలతో ఎటువంటి చర్చ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడం సరైనది కాదని, ఈ జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పటి లాగే ఉపాధి కూలీలందరికీ సార్వజనీన పద్ధతిలో ఉపాధి హామీ నిధులను వేతనాలుగా చెల్లించాలన్నారు. ఈ అడ్వైజరీ నోట్ వెనుక అనేక దురుద్ధేశాలు దాగి వున్నాయని, అసలు గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద సరగ్గా పనులు చూపించడం లేదని సమస్య తీవ్రంగా ఉన్నదని, జిల్లాలో ఈ విభజన వలన ఎస్సీ, ఎస్టీలుగా ఉన్న ఉపాధి కూలీలు వేతన బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వాటిని విడుదల చేయలని కోరారు. ఈ సందర్భంగా పలు డిమాండ్స్ తెలిపారు. ఉపాధి హామి చట్టంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన అడ్వైజరీ నోట్‌ను ఉపసంహరించుకోవాలని, పాత పద్దతిలోనే ఉపాధి కూలీలకు ఉపాధి బడ్జెట్ నిధుల నుండి వేతనాలు చెల్లించాలని, కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలి. నెలకు కుటుంబానికి 50 కేజీల సన్నబియ్యం ఇవ్వాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఉపాధి పని ప్రదేశాలలో కరోనా టెస్టులు చేయాలన్నారు. కరోనా వ్యాక్సిన్ పేదలందరికీ ఉచితంగా వెయ్యాలని, కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 లు కూలి ఇవ్వాలన్నారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు, టెంట్లు, పని పరికరాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు ముత్తయ్య, పిల్లి ఆనంద్, శెట్టి వినోద తదితరులు పాల్గొన్నారు.