Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటా వేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గుదిమళ్ళ గ్రామంలో గల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వర్షం కురిసి ధాన్యం తడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాటా వేసిన ధాన్యాన్ని కూడా బస్తాలు లేవన్న సాకుతో కల్లాల్లో ధాన్యాన్ని ఉంచుతున్నారని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇలా ఇబ్బంది పెట్టడం హేయమైన చర్య అన్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కల్లాలో ఉన్న ప్రతి గింజను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు. కాటా వేసిన ధాన్యాన్ని కూడా వెంటనే గోదాములకు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్, సీపీఐ(ఎం) నాయకులు పొన్నెకంటి సంగయ్య, సాల్వే వెంకటేశ్వర్లు, జింక బాలరాజు తదితరులు పాల్గొన్నారు.