Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలోని నిర్మల్ హృదరు స్కూల్లో బివికె ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కి ముదిగొండ మండలం, ముదిగొండ, వెంకటాపురం గ్రామాల సీపీఐ(ఎం) గ్రామ శాఖల ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు సహకారంతో సుమారు 500 మందికి సరిపడా ఒక రోజు సరుకులు, చికెన్, పండ్లు, రైస్ ఇతర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాయల వెంకటేశ్వర్లుకి, సీపీఐ(ఎం) ముదిగొండ, వెంకటాపురం గ్రామ శాఖలకు ఖమ్మం జిల్లా కమిటీ నుంచి బీవీకే ఐసోలేషన్ సెంటర్ తరుఫున ధన్యవాదాలు తెలిపారు. దాతల సహకారంతో ఐసోలేషన్ సెంటర్లో ఉన్న బాధితులకు మాత్రమే కాక, ఇళ్ళ వద్ద హోం ఐసోలేషన్లో వున్న ఇతర కోవిడ్ బాధితుల ఇళ్ళకు, హాస్పిటల్లో వుంటున్న వారికి 500 భోజనం పార్సిల్స్ పంపుతున్నట్లు తెలిపారు. ఈ సెంటర్లో దాదాపు 25 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బండి రమేష్, బివికె ఐసోలేషన్ సెంటర్ బాధ్యులు శ్రీనివాసరావు, డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వాసిరెడ్డి ప్రసాద్, నాయకులు భాస్కర్ రావు, నాగేశ్వరరావు, రవి, పురుషోత్తం, మర్లపాటి వెంకటేశ్వర్లు, పద్మ, కళ్యాణ్, భద్రయ్య, డీవైఎఫ్ఎ నాయకులు బట్టు రాజు, సత్తుపల్లి నరేష్, కణపర్తి గిరి, మేట్టేల సతీష్, షరీఫ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.