Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా కష్ట కాలంలో ఆపదలో ఉన్న వారికి మానవతా విలువలు పంచుతూ, వారి ఆకలి తీర్చుతున్న 'భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్' నిర్వహకులకు అభినందనలని భద్రాద్రి కొత్తగూడెం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 12వ రోజు భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కరోనా బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్న భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, వారికి సహకరిస్తున్న వారు మానవతా విలువలు పంచుతున్నారని అభినందించారు. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న సమయం, కరోనా కష్ట కాలంలో బాధితుల కుటుంబాలకు మేము న్నామని బరోసా ఇచ్చి, పౌష్ఠిక ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్న వారిలో భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ సభ్యులు సమాజ హితం కోరుతూ చేస్తున్న ఈ సేవలకు అందరూ సహకరించాలని కోరారు. కరోనా బాధిత కుటుంబాల వద్దకు నేరుగా వెళ్ళి భోజనాలు అందిస్తున్న వాలంటీర్లును అబినందిచారు. అమెరికాలోని డాక్టర్స్ చిరునోముల రామ్ మూర్తి పద్మావతి దంపతుల పెండ్లి రోజు సందర్భంగా 12వ రోజు అన్న దానం చేసినట్టు వివరించారు. ఈ కార్యక్ర మంలో లక్ష్మీదేవిపల్లీ మండల జెడ్పీటీసి మేరెడ్డి వసంత, రోటరీ క్లబ్ బాధ్యులు ఆనంద్, నాగ రాజ శేఖర్, భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, లక్ష్మీదేవిపల్ల పంచా యతీ ఉప సర్పంచ్ లగడపాటి రమేశ్ చంద్ర, సమన్వయ కర్త షేక్ దస్తగిరి, ప్రధాన కార్యదర్శి గుండపునేని సతీశ్, మహిళా ఛైర్మన్ జ్యోతీ రాణి, ముఖ్య సలహ్షాదారులు లోగాని శ్రీనివాస్, సీపీఐ(ఎం) నాయకులు జాటోత్ కృష్ణ, నల్లమల్ల సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు మెరెడ్డి జనార్ధన్ రెడ్డి, వాలంటీర్లు సతీష్, సంపత్, ఉపేందర్ మల్లికార్జున్, ఓదెలు, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.