Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పోరాడుతూ మణుగూరు హెచ్ఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కోడిపెల్లి శ్రీనివాస్ మృతి చెందాడు. గత కొన్ని రోజు క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మణుగూరు ఏరియాలో కార్మిక నేతగా గుర్తింపు పొందిన కోడిపల్లి శ్రీనివాస్ మరణం పట్ల పలు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమం కోసం అనునిత్యం అంకితమై పని చేసిన కోడిపెల్లి శ్రీనివాస్ మృతి కార్మిక లోకానికి తీరనిలోటు అన్నా రు. టీబీజీకేస్ ఉపాధ్య క్షులు వుకంటి ప్రభాకర్, ఐఎన్టీ యూసీ నాయకులు వెలుగపల్లి జాన్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్ర టరీ వై.రాంగోపాల్, జిల్లా ఉపాధ్య క్షులు ఆర్.మధుసూదన్‌రెడ్డి, నాసర్ పాషా, శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలియజేశారు.
శ్రీనివాస్ మృతి విచారకరం హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్
కోడిపెల్లి శ్రీనివాస్ ఆకాల మరణం కార్మిక లోకానికి తీరని లోటని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం కోడిపెల్లి శ్రీనివాస్ మృతికి సంతాపంగా ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ తోట వేణు ఆధ్వర్యంలో సెంట్రల్ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో తోట వేణు, నారాయణ, రాజమౌళి, చందర్రావు, రామస్వామి, గౌహర్ బైగ్, రాజయ్య, డేవిడ్, ఏరియా నాయకులు పాల్గొన్నారు.