Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కోవిడ్-19 రెండవ దశ వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక కృషితో ప్రతి మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య అన్నారు. ఆదివారం వారు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా రామచంద్రుని పేట గ్రామంలో కరోనా సోకిన సుమారు 40 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు నిత్యావసరాలు అందజేశారు. అనంతరం లకీëనగరం బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన 25 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం దుమ్ముగూడెం వైద్యశాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారి బాలాజీ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె వైద్యశాలలో ప్రసూతి అయిన నలుగురు మహిళలకు కేసీఆర్కిట్లు అందజేయడంతో పాటు పండ్లు అందజేశారు. అనంతరం ఆమె ముసలి మడుగు గ్రామంలో కరోనా సోకిన 50 బాదిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అంద జేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎజన్సీ ప్రాంతంలో కరోనా సోకిన ప్రతి ఒక్కరికీ భరోసా నింపేందుకు గిరిజన గ్రామాల్లో మా నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎవ్వరూ అధైర్య పడాల్సిన పని లేదని మేము మీకు తోడుగా ఉన్నాం అంటూ కరోనా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పినట్టు ఆమె తెలిపారు. తమ సొంత ఖర్చులతో కరోనా బాదిత కుటుంబాలకు నిత్యావసరాలు అంద జేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి కరోనా పరీక్షలు నిర్వహించి సింటం ఉన్న ప్రతి ఒక్కరికి మందుల కిట్లను ఆశా వర్కర్ల ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. ఆమె పర్యటన కోసం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, సీఆర్పీఎప్, పోలీస్ బలగాలతో పెద్ద ఎత్తున బందో బస్తు ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించారు. పర్యటనలో భాగంగా ఆమె వెంట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, మండల అద్యక్షులు అన్నెం సత్యనా రాయణమూర్తి, ఎంపీపీ రేసు లకీë, జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, తహశీల్దార్ వర్షారవికుమార్, ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, నాయకులు రమేష్, పార్టీ సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు, సర్పంచ్‌లు కొర్సా అశ్విని, తెల్లం వరలకీë, ఇర్పా చంటి, జుంజురి లకీë, నూపా సుమిత్ర, రజినితో పాటు ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, జయసింహ, కాల్వ పూర్ణయ్య పాల్గొన్నారు.