Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దూసుకొస్తున్న కరోనా మూడవ దశ
- వచ్చే విద్యా సంవత్సరంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
- ప్రతీఏడాది ఫీజులే వసూలు చేసేలా విద్యాశాఖ కసరత్తు
- జిఓ 46ను కొనసాగించేలా చర్యలు
- త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం
నవతెలంగాణ-పాల్వంచ
ఈ ఏడాది పాఠశాలలు ఉంటాయా ఆన్లైన్లోనే క్లాసులు జరుగుతాయా... పిల్లలను కబలించేందుకు కరోనా మూడవ దశ దూసుకొస్తున్న పరిస్థితులలో పిల్లలచదువులు ఎలా .. ఫీజులు ఎంతకట్టాలి.. అన్ని సందిగ్ధంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రయివేటు పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేవిద్యాసంవత్సరం ఎలా ఉంటుందో అన్న ఆందోళనలో పెరిగిపోతోంది.
2021-22 విద్యాసంవత్సరానికి ప్రయివేటు పాఠశాలలు ఫీజులు పెంచకుండా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెంబర్ 46 ఈ విద్యాసంవత్సరానికి అమలు చేయాలనే విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. అంతకుముందు ఏడాది వసూలు చేసిన ట్యూషన్ ఫీజులనే నెలవారిగా తీసుకోవాలని జిఓలో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో 2020 ఏప్రిల్ 21న ప్రభుత్వం ఇచ్చిన జిఓ ఇంకా అమలులోనే ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. వీటిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ తరగతులు నిర్వహణలో ఇతర రాష్ట్రాలలో ఫీజులు తగ్గించాలని న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా తగ్గించాలనే అంశంపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ చర్చించారు. దీనివల్ల మొత్తం ఫీజులు పెంచి కొంత తగ్గంచాలని చెప్పే అవకాశం ఉందని దానికంటే జిఓ 46 ప్రకారం 2019-20 విద్యాసంవత్సరంలో ట్యూషన్ ఫీజులను 2021-22 సంవత్సరంలో వసూలు చేసుకునేలా చూడడం మంచిదన్న నిర్ణయానికి అధికారంలోకి వచ్చారని సమాచారం. రాష్ట్రంలో పాఠశాలలు గతకొన్ని సంవత్సరాలుగా గ్రంథాలయం కంప్యూటర్, ల్యాబ్స్ ఫీజులు విభజించకుండా అన్ని కలిపి వసూలు చేశారు. దీనిపై తల్లిదండ్రుల నుండి భారీగా ఫిర్యాదు లు విద్యాశాఖకు అందాయి. ట్యూషప్ ఫీజు అంటే ఏమిటో స్పష్టత ఇవ్వకపోవడంతో ట్రాన్స్పోర్ట్ ఫీజు తప్ప మిగితా మొత్తం వసూలు చేశారని తల్లిదం డ్రులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఈ సమ స్యతోనే 2019-20 సంవత్సరం ఆయా పాఠశాలలో ట్యూషన్ ఫీజు ఎంతో వెబ్సైట్లో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అనేక కుటుంబాలు జీవనోపాది కోల్పోయి పిల్లలకు పాఠశాల ట్యూషన్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో చాలామంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్యూషన్ ఫీజులో కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.