Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాతలకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-పెనుబల్లి
కరోనా చికిత్స పొందుతున్న పేషెంట్ లకు ఆక్సిజన్ అందించేందుకు సహకరించే మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్లను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి రమేష్‌కి హాస్పిటల్ ఆవరణంలో అందజేశారు. కరోనా బారిన పడి లక్షణాలు కలిగినవారు అంబులెన్స్‌లలో ఇంటి వద్ద నుండి హాస్పటల్ కు వచ్చే వరకు, హాస్పిటల్ నందు ఆక్సిజన్ బండిల్‌ను మార్చే సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వారికి కావలసిన ఆక్సిజన్ ను అందజేస్తాయని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. అమెరికాకు చెందిన ఎమ్మెల్యే బాల్యమిత్రుడు ఛిరాగ్ ఫౌండేషన్, బెల్లం మధు, గుర్రం జ్యోతి సహకారంతో పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి మూడు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ అందజేశారు. మరో రెండు వచ్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దాతృత్వంతో ముందుకు వచ్చిన దాతలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధన్యవాదాలు తెలిపారు. కరోనా బారినపడిన రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన దృష్టితో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సత్తుపల్లి, పెనుబల్లి మండల కేంద్రాల్లో వంద పడకల ఆక్సిజన్‌తో కూడిన ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని రెండు ఆస్పత్రుల్లో దాతల సహకారంతో పేషెంట్లుకు టిఫిన్, రెండు పూటల పౌష్టికాహారాన్ని అందించనున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు అశోక్, పెనుబల్లి వియంబంజర సర్పంచ్‌లు పంతులి, తావూ నాయక్ పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమయ్యే వారందరికీ వ్యాక్సిన్
సత్తుపల్లి : నిత్యం ప్రజలతో మమేకమై పనులు చేసే వివిధ రంగాల వారికి వ్యాక్సిన్ అందిస్తామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం కూరగాయలు, దుకాణాల్లో పనిచేసే వారికి స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ పెనుబల్లి ఆసుపత్రికి..కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ కోడూరు సుజాత, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, నాయకులు చాంద్‌పాషా, అనిల్‌కుమార్, నాయకులు గాదె సత్యనారాయణ, దొడ్డా శంకరరావు పాల్గొన్నారు.