Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
కరోనా బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేవీపీఎస్ మండల కార్యదర్శి గార్లపాటి రమేష్ డిమాండ్ చేశారు. బోనకల్ కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రమేష్ మాట్లాడుతూ కరోనా సోకిన బాధితులు కనీసం 20 రోజులపాటు హౌమ్ క్వారంటైన్లో ఉండి, చికిత్స పొందాలంటే కనీసం వారికి పోషకాహారంలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సోకిన వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా పల్లెల్లో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా గ్రామాల్లో హెల్త్ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా టెస్టులు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. కోవిడ్ రోగులకు పల్లెల్లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మంద సత్యానందం పాల్గొన్నారు.