Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఇటీవల కామెర్ల వ్యాధితో మృతి చెందిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు కర్రినాగ ముత్యం కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఆదివారం సింగరేణి ఏస్వోటు జీఎం లలిత్‌కుమార్ సతిమణి అనతి, సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్డి.నాసర పాషా ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ కొత్తమల్లేపల్లి గ్రామానికి చెందిన కర్రినాగ ముత్యం కుటుంబానికి ఈ వితరణ అందజేశారు. అనంతరం నాసర్ పాషా మాట్లాడుతూ... కొత్త మల్లేపల్లి గ్రామంలో సంవత్సర కాలంలోనే విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, కిడ్నిల సమస్య, కామెర్ల వ్యాధితో ఒక చిన్నారితో సహా మొత్తం 13 మృతి చెందడం భాదకరమన్నారు. కొత్త మల్లేపల్గి గ్రామాలోని అకాల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య బృందం అధ్యాయనం చేయాలన్నారు. ఆ కార్యక్రమంలో మంగీలాల్, విద్యా సాగర్, రావులపల్లి ముత్తమ్మ, గ్రామస్తులు రాజేంద్రం, రాములు, పెద్ద వెంకయ్య, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.