Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించకపోవడంతోనే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. మండలంలోని దర్మ్రాపురం గ్రామంలో న్యూడెమోక్రసీ, ఎఐకెఏంస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బయోగ్రీన్ రేమిడీస్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆదివారం ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టరు కృష్ణ ప్రసాద్ వైద్య బృందం అధ్వర్యంలో కరోనా నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, కరోన సోకిన వారికి ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఈ ఆరోగ్యశిభరాన్ని ఉద్దేశించి మధు, డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది కరోనా బాధితులకు మందుల కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన హాస్పిటల్ యాజమాన్యం బొగ్గారపు రాజు, సతీష్, న్యూడెమోక్రసీ నాయకులు ఎట్టి నర్సింహారావు, శ్రీను, ఎర్రన్న, రంగక్క, బుచ్చయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.