Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మండలంలో రెండు బాల్య వివాహాలను ఐసీడీఎస్ ఆధికారులు ఆదివారం అడ్డుకున్నారు. వెంకిట్యాతండా, మేకలతండా గ్రామాల్లో బాల్యా వివాహాలు చేస్తున్నారని విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు వివాహాలు జరిగే ఇండ్లకు వెళ్ళి వివాహలు అపాలని కోరారు. బాల్యా వివాహాలు చేయటం వలన కల్గి దుష్పాప్రభావలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కామేపల్లి సీడీపీవో దయామణి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టంప్రకారం బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆధార్‌కార్డు, విద్యకు సంబంధిత రికార్డులలో పుట్టిన తేదిని ప్రామాణికంగా గుర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు జర్పల శాంతి, అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
దబ్బతండా అంగన్వాడీకి నోటీస్
దుబ్బతండా అంగన్వాడీ కేంద్రం పరిధిలో బాల్య వివాహం జరిగిందనే విషయమై అంగన్వాడీ టీచర్ బానోత్ సోనకు నోటీస్ జారీకి ఆ క్లస్టర్ సూపర్వైజర్ను ఆదేశించినట్లు సీడీపీవో దయామణి తెలిపారు. నోటీస్‌పై వివరణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో బాల్య వివాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు