Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో 713 యాక్టివ్ కేసులు
- కరోనా కాటుకు 42 మంది బలి
నవతెలంగాణ- కారేపల్లి
కారేపల్లి మండలంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కరోన వస్తే ఊరంతటిని చుట్టేస్తుంది. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలలో దుబ్బతండా పంచాయతీలోని మేకలతండా గ్రామంలో 843 మంది జనభా ఉంది. ఇక్కడ 24 కేసులు నమోదైనాయి అంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో వేడుకలకు అడ్డుచెప్పేవారు లేక పోవటంతో కరోనా ఉదృతి అగటం లేదు. ప్రజలల్లో నెలకొన్న నిర్లక్ష్యం భారీ మూల్యానే చెల్లించుకోవల్సి వస్తుంది. మండలంలో ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు 6434 మందికి పరీక్షలు చేయగా 2281 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 713 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ వై.హన్మంతరావు, వైద్యురాలు డాక్టర్ నెల్లూరి చందన లు తెలిపారు. వీరిలో 237 మంది ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో ఆశ్రయం పొందుతుండగా 476 మంది హౌం ఐసోలేషన్ ఉంటున్నారు. ఇప్పటి వరకు మడలంలో కరోనా కాటుకు 42 మంది బలైనారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులను చూస్తుంటే కారేపల్లి మండలంలో పరిస్ధితి అదుపుతప్పినట్లు కనిపిస్తుంది. ఏప్రిల్ మాసంలో 1770 మందికి పరీక్షలు చేయగా 419 కేసులు నమోదైనాయి. మే లో 2714 మందికి 1322 కేసులు రాగా, జూన్ మాసంలో వారం రోజులో 1950 మందికి పరీక్షలు చేస్తే 540 మందికి పాజిటీవ్ వచ్చింది.
వేడుకలతో పెరుగుతున్న కేసులు
ప్రభుత్వం వేడుకలను వాయిదా వేసుకోవాలని తప్పనిసరి పరిస్ధితిలో పరిమితమైన మందితో వివాహ వేడుకలు జరపాలని చెప్పినా దానిని పెడచెవిన పెట్టి దొడ్డిదారిన అధికారుల కనుగప్పి వేడుకలు నిర్వహింస్తుండటం దానికి భారీగానే హాజరవుతుండం కేసులు పెరగటానికి ద్రోహదం చేశాయి. ఏగ్రామంలో అధికంగా వేడకులు జరిగాయే అదే గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. సోమవారం 585 మందికి పరీక్షలు జరిపితే 91 మందికి పాజిటీన్గా తేలింది. వీరిలో మేకలతండా 24, ఉసిరికాయలపల్లి 10, కారేపల్లి, పాటిమీదిగుంపులలో 9 చొప్పున, లావుడ్యాతండాలో 5, భాగ్యనగర్తండా, ఫైల్తండా, సూర్యతండాలలో 4 చొప్పున, జైత్రాంతండాలో 3, దుబ్బతండా, గిద్దవారి గూడెం, మాణిక్యారం, చండ్రాళ్లగూడెం, గంగారం తండాలలో 2 చొప్పున, రావోజీతండా,టేకులగూడెం, గుట్టకిందిగుంపు, గేటురేలకాయలపల్లిలలో ఒక్కొక కేసు నమోదయ్యాయి.