Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, నల్లగొండలోని వెంకటరమణ ఆటోమోబైల్స్, వీవీసీ గ్రూప్ సీవోవో మొగుళ్ల వెంకటేశ్వర్లు (54)సోమవారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నెలరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన కోలుకుంటున్న దశలో గుండెపోటుతో మరణించారు. సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న ఆయన క్లర్క్ నుంచి అంచలంచెలుగా ఎదిగి సీవోవో స్థాయికి చేరుకున్నారు. వెంకటేశ్వర్లుకు భార్య లావణ్య, ఇద్దరు కుమారులు అఖిల్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా ఆకాశ్ ఎంబీబీఎస్ చదువుతున్నారు. నగరంలోని శ్రీనివాసనగర్‌లో ఆయన ఉంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలోని తన స్వగ్రామంలో వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిర్వహిస్తారు. వెంకటేశ్వర్లు మృతికి వీవీసీ, వీఆర్ఏ గ్రూప్ సంస్థల ఎండీ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆయన కుమారుడు కార్పొరేటర్ వలరాజు, సంస్థ యాజమాన్యం, జీఎం, సిబ్బంది తదితరులు వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.