Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాజిటివ్ కేసులను ఐసోలేషన్లకు తరలించండి
- కోవిడ్19పై రివ్యూ మీటింగ్లో అధికారులకు జెడ్పీ చైర్మెన్ సూచన
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బోర్డర్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కరోన నివృత్తికి ప్రజల సహకరించే విధంగా ప్రయత్నం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సూచించారు, మండల కేంద్రమైన ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో, జరిగిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు, గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గేందుకు కరోనా పేషెంట్లకు నచ్చజెప్పి వారిని గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలలో ఉండే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు, కార్యక్రమంలో ఎంపీపీ శిరీష, జడ్పిటిసి కవిత, ఎంపీడీవో రామకృష్ణ, ఎస్ఐ ఉదరు కిరణ్, డిప్యూటీ తాసిల్దార్ రాజేష్, మెడికల్ ఆఫీసర్ సుధాకర్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ అయులూరి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ చైర్మన్ చావా రామకష్ణ, స్థానిక సర్పంచ్ మొగిలి అప్పారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు,. తొలుత పెద్ద గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బనిగండ్లపాడులో గల సొసైటీ చైర్మన్ శీలం అంకిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు పాలవడంతో ఆయన ను పరామర్శించారు, అనంతరం బండారు బాజీ బాబుకి మంజూరైన 56 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ను అందించారు, స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఎర్రుపాలెం మండలానికి చెందిన పాస్టర్లకు ఎర్నెస్ట్ పాల్ ఆధ్వర్యంలో 25 మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు,ఎంపిపి దేవరకొండ శిరీష,జెడ్పీటీసీ శీలం కవిత, డీసీసీబీ డైరక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చావ రామకష్ణ, ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు, ఆత్మ కమిటి చైర్మన్ రంగిసెట్టి కోటేశ్వర రావు, బనిగడ్లపాడు సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ఎంపీటీసి యన్నం సత్యనారాయణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నారాయణ, గద్దల వెంకటేశ్వర్లు, కనకయ్య తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.