Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కరోనా కష్టం కాలంలో పేద పాస్టర్లను ఆదుకోవటానికి గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సోసైటీ (జీటీఎస్ఎస్ఎస్) అనే స్వచ్ఛంద సేవా సంస్ధ ముందుకు వచ్చింది. సోమవారం కారేపల్లి, కామేపల్లి మండలాలకు చెందిన 65 మంది పేద పాస్టర్లకు 25 కేజీల బియ్యం, గోధుమ పిండి,రవ్వ, పంచదార, అయిల్, ఉప్పు వంటి నిత్యావరస వస్తువులను అందజేశారు. వీటిని కారేపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు అజ్మీర నరేష్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు చేతుల మీదిగా పాస్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో సేవా సంస్ధ వ్యవస్ధాపకులు ఎం.జాకబ్, సంస్ధ ప్రతినిధులు శామ్యూల్, జే.అశోక్‌కుమార్, పాస్టర్లు తన్నీరు మధుసూధన్‌రావు, రమేష్, శ్యాసుందర్ తదితరులు పాల్గొన్నారు.