Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మంలో చిరాగ్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2 లక్షల 70 వేల రూపాయల విలువగల నాలుగు(4) ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్ మరియు ఐఎంఏ సెక్రటరీ డా. కూరపాటి ప్రదీప్ చేతుల మీదగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లకు అందజేయనైనది. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతు ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగి ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్న చిరాగ్పౌండేషన్ క్రియాశీలక సభ్యులు బెల్లం మధు, గుర్రం జ్యోతి, చావ శ్రీధర్, మల్లిశెట్టి సాగర్, జరుగుల శ్రీనివాస్ వారి మిత్రబృందంతో కలిసి గతంలో 20 లక్షల రూపాయల విలువ గల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ను అందించడం, ఇప్పుడు 2 లక్షల 70 వేలు విలువగల నాలుగు(4) ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ను (ఎన్.ఆర్.ఐ) పేరెంట్స్కు అందించి పుట్టిన గడ్డపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు అని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు(వై.వి), అసోసియేషన్ సభ్యులు రమేష్ బాబు, అప్పారావు, వెంకటేశ్వరరావు, రామారావు, స్వరూపరాణి, ఝాన్సీ, సతీష్, రామకృష్ణ, అనంత కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.