Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
వర్షానికి తడిసిన ధాన్యంను ఎటువంటి తరుగు లేకుండా మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా అధికారులు చూడాలని కోరుతూ ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ సోమవారం ఆడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. మిల్లర్లు తొందరగా ధాన్యంను దిగుమతి చేసుకొని వెంటనే లారీలను వెనక్కి పంపిస్తే కొనుగోలు కేంద్రంలో ఉన్న మిగతా ధాన్యంను కూడా త్వరగా మిల్లులకు తరలించడానికి అవకాశం ఉంటుందని ఆమె అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుందని గుర్తు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎంపీపీ ఉమ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, ఏదులాపురం పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు ధర్మారెడ్డి, మట్టా వీరభద్రం, వెంకన్న పాల్గొన్నారు.