Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరా ఏసీపీ సత్యనారాయణ
నవతెలంగాణ-బోనకల్
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గల బోనకల్ చెక్ పోస్ట్‌ను వైరా ఏసీపీ కే సత్యనారాయణ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ముగ్గురు యువకులు మోటార్ సైకిల్ పై వస్తుండగా వారిని నిలిపివేశారు. వైరా మండలం పాలడుగు గ్రామంలో బంధువులు మృతిచెందారని అక్కడికి వెళ్తున్నామని వారు చెప్పారు. అయితే మృతదేహం ఫొటో చూపించాలని లేదా వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపించాలని గట్టిగా కోరారు. వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపించటంతో మానవతా దృక్పథంతో వారిని వదిలి వేశారు. అదే సమయంలో విజయవాడ నుంచి కారులో వైద్య పరీక్షలు నిర్వహించుకొని ఖమ్మం వస్తున్న కారుని కూడా నిలిపివేశారు. బాధితులు కార్ లో నుంచి వచ్చి తాము విజయవాడలో గుండె ఆపరేషన్ చేయించుకుని ఖమ్మం వెళ్తున్నామని ఆధారాలు చూపించడంతో వారిని కూడా వదిలి వేశారు. ఆయన వెంట వైరా, మధిర సిఐలు జె సత్యనారాయణ, ఒడ్డేపల్లి మురళి, బోనకల్ ఎస్ఐ కొండలరావు తదితరులు ఉన్నారు