Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. కోయనర్సాపురం గ్రామానికి చెందిన సుమారు 25 కరోనా భాదిత కుటుంబాలకు మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. రోగుల కోసం లకీëనగరం గ్రామంలో గల గిరిజన బాలికల వసతి గృహంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు, స్థానిక సర్పంచ్ వర్సా అనిత, కల్లూరి వీరభద్రం, తెల్లం నాగరాజు తదితరులు ఉన్నారు.
దమ్మపేట : డిస్ట్రిక్స్ యన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో దమ్మపేట గ్రామ పంచాయతీలోని నల్లకుంట గ్రామంలో కరోనా వ్యాధికి గురైన 22 కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు పౌష్టికాహారాన్ని సైతం సోమవారం కరోనా బాదిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ ప్రత్యేకాధికారి డాక్టర్ మన్యం రమేష్‌బాబు, కార్యదర్శి పసుపులేటి కృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నల్లకుంట గ్రామస్తులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో సోమవారం వడ్డెంపూడి రాము తల్లి జ్ఞాపకార్ధం 30 మంది కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన సోడె కామయ్య కుటుంబానికి రూ.2వేల ఆర్దిక సాయాన్ని చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొడియం సుజాత, ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్, మాజీ సర్పంచ్ అనీల్‌కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు నాగేశ్వరరావు, కళ్యాణ్, వీరభద్రం, రాజు, ధర్మరాజు పాల్గొన్నారు.