Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని పెంట్లం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ పంచాయతీ ప్రజలకు ఎర్రగుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో సర్పంచ్ సవలం రాణి దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ వర్షకాలం ప్రారంభం కావడంతో దోమలు బెడద ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వాటి నుంచి రక్షణగా ఈ దోమ తెరలను వాడాలన్నారు. ఈ దోమ తెరలు మలేరియా వచ్చినటువంటి గ్రామాల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, హెల్త్ సూపర్ వైసర్ శారారాణి, హేచ్.ఏ పొన్నారి, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని ముత్తాపురం పంచాయతీలో సోమవారం జడ్పీటీసీ వాగబొయిన రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా నివారణకు దోమతెరలు వాడకం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం సమ్మయ్య, పంచాయతీ సెక్రెటరీ త్రివేణి, హెచ్వీ పద్మ, మలేరియా టెక్నీకల్ సూపర్వైజర్ సత్యం, ఏఎన్ఎం భువనేశ్వరి, అంగన్వాడి కార్యకర్త, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : మండల పరథిలోని పట్వారిగూడెం గ్రామంలో జ్వరాల నుండి కాపాడుకోవడానికి పేదలకు ఉచిత దోమతెరలను సోమవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, డాక్టర్ ప్రత్యూష, మౌనిక, సర్పంచ్ మొగిలి అంజలి, ఉపసర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య, కూరం కమల పాల్గొన్నారు.
మణుగూరు : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎంపీపీ కారం విజయకుమారి తెలిపారు. సోమవారం మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వున్న సమితిసింగారం పంచాయతీలోని ఆశోక్నగర్ ఏరియాలోని ఆరోగ్య ఉపకేంద్రం నందు దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి మొత్తం 19 గ్రామాలకు 9,650 దోమ తెరలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సమితిసింగారం సర్పంచ్ బచ్చల భారతి, డాక్టర్ మౌనిక, ఎంపీవో వెంకటేశ్వరరావు, సీహెచ్వో వెంకటేశ్వరరావు, ఎస్యువో లింగయ్యనాయక్, సూపర్వైజర్ స్వర్ణలత, వార్డు మెంబర్లు, ఆశాలు పాల్గొన్నారు.