Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని లచ్చిగూడెం గ్రామానికి చెందిన పూనెం సాగర్ (26) గిరిజన యువకుడు గత కొన్ని రోజులుగా కరోనా సోకి శ్వాస అందక ఇబ్బంది పడుతున్నాడు. రెక్కాడితే డొక్కాడని ఆ నిరుపేద గిరిజన కుటుంబం సాగర్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యానికి వీరికి ఆర్దిక స్థోమత లేక పోవడంతో గ్రామానికి చెందిన బ్యూటీ ఫుల్ లైఫ్ అసోసియేషన్ సభ్యుడు శ్యామల రవి స్వచ్ఛంద సంస్థ నిర్వహకుల దృష్టికి తీసుకు పోయాడు. దీంతో స్పందించిన బీఎల్ఏ నిర్వహకులు సాగర్ వైద్య ఖర్చుల కోసం రూ.2 వేల 500 అందజేశారు. దాతలు ముందుకు వచ్చి సాగర్ వైద్య ఖర్చుల కోసం తమ వంతుగా ఆర్ధికంగా సహాయం అందించాలని కోరారు. సహాయం చేసే దాతలు రోగి అల్లుడు అయినటువంటి శీలం గౌతమ్ 6302087001 అనే ఫోన్ నెంబరుకు తమకు తోచిన విదంగా సహాయం అందించి గిరిజన యువకుడి ప్రాణాలు కాపాడాలని ఆయన అన్నారు.