Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలో మీ సేవలు మరువలేనివి
- ప్రభుత్వం సకాలంలో వాక్సిన్ వేయించాల్సింది అ ప్రముఖ డాక్టర్ నాగరాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా కష్ట కాలంలో జర్నలిస్టులు కరోనా కట్టడికి చేస్తున్న సేవలు మరువలేనివని, వారికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది కలిగిన వెంటనే వైద్యం అందించేందుకు సహకరిస్తానని, ప్రభుత్వం సకాలంలో వాక్సిన్ ఇచ్చి ఉండాల్సిందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏ.నాగరాజు ఆన్నారు. సోమవారం ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ వారి సహకారంతో లక్ష్మీదేవిపల్లి మండలలో పని చేస్తున్న పలువురు జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు. జర్నలిస్టులందరికీ తన హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిదేవిపల్లి యస్.ఐ.అంజయ్య, లక్ష్మీదేవి పల్లి సర్పంచ్ తాటి పద్మ, ఎస్జీఎఫ్ భద్రాద్రి జిల్లా ఇన్చార్జి, ఉప రాష్ట్ర్టపతి అవార్డు గ్రహీత మహమ్మద్ ఖాసిం, ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ సభ్యులు చిట్టి మళ్ళ బ్రహ్మం, మేకల జ్యోతి రాణి, రమాదేవి, జరీనా బేగం, సీనియర్ జర్నలిస్టు లోగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.