Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరథిలోని నాచారం గ్రామంలో కామ్రేడ్ కోమటి వెంకయ్య 9వ వర్థంతి సభను సోమవారం కొండారు యలమంద అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద పార్టీ మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. కోమటి వెంకయ్య చిత్రపటానికి రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డా లకిëనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ్యులందరూ నివాళులర్పించారు. మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంకయ్య చదువు లేకపోయినా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి తుదిశ్వాసవరకు పార్టీలో కొనసాగించారన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి వెంకటేశ్వరరావు, కోమటి వెంకయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.న