Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
బండారుచందర్రావు కరోనా సహాయక కేంద్రం ద్వారా ఇప్పటికే కరోనా బారిన పడిన వారికి సేవలందిస్తున్న బండారు చందర్రావు (బీసీఆర్) ట్రస్టు ఇప్పుడు తన సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా భద్రాచలంలో ఉచిత కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని మంగళ వారం ప్రారంభిస్తున్నట్టు బీసీఆర్ ట్రస్టు నిర్వాహకులు ఏజే రమేష్, గడ్డం స్వామిలు తెలిపారు. యన్ఆర్ఐ ఫౌండేషన్, తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు, పూర్వ విధ్యార్ధుల సంఘం ఏన్కూర్, తానా వారి సహకారంతో బండారు చందర్రావు ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉచిత కరోనా ఐషోలేషన్ కేంద్రంను ప్రారంభించనున్నారు. కూనవరం రోడ్డులో గల డిగ్రీకాలేజి పక్కన వున్న గిరిజన బాలికల పీయంహెచ్ హాస్టల్ భవనం ప్రారంభంకానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్, భద్రాచలంలో వున్న ప్రముఖ వైధ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా, నాయకులు బీసీఆర్ ట్రస్టు సభ్యులు పాల్గొంటారు. మొదట 25 బెడ్లతో ప్రారంభమై పేషంట్లకు తగినవిధంగా బెడ్లు పెంచుతామని ఐషోలేషన్ సెంటర్ నిర్వహకులు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రం నిర్వహణకు పట్టణానికి చెందిన నలుగురు ప్రముఖ వైద్యులు అవసరమైన వైద్య సేవలందించటం కోసం ముందుకొచ్చారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకరు చొప్పున నిరతరం అందుబాటులో వుండే విధంగా నర్సింగ్ స్టాఫ్‌ను ట్రస్టు ఏర్పాటు చేసింది. పేషంట్లకు రుచికరమైన పౌష్టిక ఆహారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అవసరమైన మందులు సిద్ధం చేశారు. ఐసోలేషన్ కేంద్రం ఏర్పాట్లను తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.