Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా వున్న వ్యక్తులను పోలీసులు తనిఖీలు నిర్వహించగా వారి వద్ద ప్రభుత్వ నిషేధిత గంజాయి లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ వెల్లడించారు.
భద్రాచలంలోని కూనవరం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పట్టణ ఎస్ఐ ఎం. సిల్వా రాజు, పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయములో ఏపీ 28 ఏఎక్స్ 2229 అనే కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో 200 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ గంజాయి విలువ సుమారు 30 లక్షల విలువ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన రూపావత్ రవి, ధరావత్ శంకర్లు ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ గంజాయిని మిర్యాలగూడెం తీసుకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మేరకు ఈ ఇరువురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భద్రాచలం పట్టణంలోని సరిహద్దులో 24 గంటలు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని, నిషేధిత వస్తువులు అయినా గంజాయి, మరే ఇతర వస్తువులు తరలించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి. వినీత్ హెచ్చరించారు. ఈ సమావేశంలో భద్రాచలం పట్టణ సిఐ టి.స్వామి, పట్టణ ఏఎస్ఐ శేషగిరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.