Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపి సేవా పతకాలు పొందిన పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సోమవారం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం, న్యూఇయర్ డే పురస్కరించుకుని తమ విధినిర్వహణలో అత్యంత ప్రతిభను ప్రదర్శించి ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులకు 2020-2021 ఏడాది గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవ పతకాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన 27 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతుల మీదుగా పోలీసు సిబ్బంది సేవ పతకాలు అందజేశారు. ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏసీపీ వెంకటస్వామితో పాటు 8 మందికి న్యూఇయర్ డే సందర్భంగా ప్రకటించిన కఠిన సేవ పతకాలు, 13 సేవ పతకాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరుగురుకి పోలీసు సేవా పతకాలు లభించాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, డీసీపీ ఎల్ సి నాయక్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్న కుమార్, వెంకటస్వామి, ఆర్ఐలు రవి, సాంబశివరావు, తిరుపతి పాల్గొన్నారు.
ఏఎస్ఐ విష్ణుమూర్తికి రూ.20 వేల రిపోర్ట్ ను అందజేసిన సీపీ
తల్లాడ : తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణుమూర్తికి సోమవారం సిపి విష్ణు వారియర్ రూ.20 వేల నగదు రివార్డును అందజేశారు. ఉత్తమ సేవా పథకం పొందిన వారికి రూ.20 వేల నగదు రివార్డులను అందజేస్తారు. అందులో భాగంగా నగదు రివార్డులు అందజేశారు, 25 మందికి నగదు రివార్డులు అందజేశారు. రివార్డ్ అందుకున్న విష్ణుమూర్తిని ఎస్సై జి నరేష్, ఏఎస్ఐ ప్రసాద్ అభినందించారు.