Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ కేంద్రాలను సందర్శించి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ -నల్గొండ
ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు విధించకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి నల్లగొండ టౌన్ అర్జాల బావిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కొనుగోలుకు సిద్ధమైన ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాలలో ఇంకా 12వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తేమ, తాలు పేరుతో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బంది గురి చేస్తే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు కలిగి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసిన ధాన్యం లో తాలు ఉందని మిల్లు యజమానుల వద్దకు రైతులను తీసుకెళ్లి రైతుల తూకాలలో కోతలు విధించేందుకు చేసే కుట్ర ను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 60 రోజుల నుండి పడిగాపులు కాసినా వడగండ్ల వర్షానికి రైతులు అవస్థలు పడుతున్న ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు . వారం రోజులలో దాన్ని మొత్తం కొనుగోలు చేసి వెంటనే వారి డబ్బులు ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాత్మాగాంధీ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.