Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
మృగశిర కార్తె ప్రారంభం కావడంతో మంగళవారం చేపల ధరలకు రెక్కలు వచ్చాయి. మృగశిర కార్తె ప్రారంభం నాడు చేపల కూర తినాలనే సాంప్రదాయం తాతల కాలం నుండి వస్తున్నది. దీంతో చేపలు కొనేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. ఇదే అదునుగా భావించిన చేపల వ్యాపారులు రోజువారి ధరల కంటే రెట్టింపు రేట్లతో చేపల అమ్మకాలు చేపట్టారు. రవ్వ చేప, బొచ్చే చేప, బంగారుతీగ చేప మాములు రోజులలో రూ.150 ఉండగా మంగళవారం నాడు మాత్రం 180 నుండి 200 వరకు రేటు పలికింది. ఒక్క కొర్రమీను చేప మాత్రం ఎక్కువుగా 400-500 వరకు రేటు పలికింది. రొయ్యలు మాత్రం అత్యధికంగా 400 రేటు పలికింది. త్రీటౌన్ ఏరియా, ప్రకాష్ నగర్, బైపాస్ రోడ్డు,బస్ డిపో రోడ్,ముస్తఫా నగర్, కాలవడ్డు మరి ఇతర ప్రాంతాలలో జోరుగా అమ్మకాలు చేశారు. అయినప్పటికీ ప్రజలు లెక్క చేయకుండా చేపలను కొనుగోలు చేశారు.