Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాస్ రావు
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే కార్మిక వర్గ నిరసనను బిల్డింగ్ రంగంలోని ప్రతి కార్మికుడు జయప్రదం చేయాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాస్ రావు అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవనంలో మంగళవారం సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తుందన్నారు. పనులు లేక భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు దిన స్థితిలోకి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు పదివేల రూపాయలు,50 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమళ్ళపల్లి మోహన్ రావు,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దోనోజు లక్ష్మయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మేడికొండ నాగేశ్వరరావు, చిగుళ్ళు వెంకటరమణ, యర్రా మల్లికార్జున్, దోనోజు పాపచారి, ఐతగాని రవి తదితరులు పాల్గొన్నారు.