Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
కరోనా వ్యాప్తి నివారణ లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బంది పడుతున్న పౌరసమాజాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నామ ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక పర్యవేక్షకులు, టీఆర్ఎస్ కీలక నేత బియ్యం వెంకటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం రూ.40 వేలు విలువగల కూరగాయలను, కోడిగుడ్లు, శానిటైజర్లను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతులు మీదుగా మండల పరిషత్ కార్యాలయంలో అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, సీఐ బంధం ఉపేందర్ రావు, ఎస్ఐ చల్లా అరుణ, అదనపు ఎస్ఐ రామ్మూర్తి, తెరాస నాయకులు బండి పుల్లారావు, బండారి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.