Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీల్లో కనీస రక్షణ చర్యలు కరువు
- కష్టం ఎక్కువ గౌరవ వేతనం తక్కువ
నవతెలంగాణ-పినపాక
పారిశుధ్యం మెరుగ్గా ఉంటే పల్లెలు అభివృద్ధి పథంలో ముందుంటాయని ప్రజలందరికీ తెలిసిందే. పారిశుధ్యం విషయంలో పంచాయతీ కార్మికుల సేవ ఎవరు మరువలేనిది. ప్రజలు మొత్తం వ్యాధులకు దూరంగా ఉండటానికి స్వచ్ఛమైన గ్రామాలుగా విరజిల్లడానికి వారి పాత్ర కీలకం. స్వచ్ఛ వాతావరణాన్ని కల్పించడంలో పారిశుధ్య కార్మికులు క్రియాశీలక బాధ్యతగా నిర్వహిస్తున్నారు. అలాంటి కార్మికులకు గ్రామ పంచాయతీల్లో కనీస రక్షణ చర్యలు కరవయ్యాయి. వారి సేవలని ప్రజలు గుర్తించని పరిస్థితి. కరోనా, ఆర్థిక ఇబ్బందుల మధ్య తమ విధులను పంచాయతీ కార్మికులు నిర్వహించాల్సి వస్తోంది. పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహణలో భాగంగా గౌరవ వేతనం తక్కువ అయిన ప్రతి రోజు స్థానికుల ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తారు. నిత్యం మురుగుకాల్వల్లో పూడిక తొలగించడం, రహదారులు శుభ్రం చేయడం వంటి పనులను పారిశుధ్య కార్మికులు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగు కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల రక్షణ విషయంలో ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.
ప్రతి ఒక్క కార్మికుడికి విధిగా పంచాయతీ నిధుల నుంచి ఏకరూపక దుస్తులతో పాటు బూట్లు, గ్లౌజులు, మాస్క్లు, సబ్బులు, శానిటైజర్, మాస్క్లు వంటివి కొనుగోలు చేసి ఇవ్వాలి. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. వీరికి నెలకు రూ.18 వేలు తప్పకుండా గౌరవ వేతనాన్ని కల్పించి సముచిత స్థానం కల్పించాలి. అలాగే ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి.
ఉదయం నుంచి అన్ని రకాల సేవలు చేస్తాం
సంపత్ కుమార్, పంచాయతీ కార్మికుడు, ఈ బయ్యారం
కరోనా మహమ్మారి వచ్చిన ఇండ్లకు సైతం వెళ్లి మా ప్రాణాలను పణంగా పెట్టి బ్లీచింగ్ పని చేస్తున్నాం. డ్రైనేజీ పనులు చేయడం, ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్త సేకరించి పంచాయతీ పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్న.