Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సరళ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు ''మంచికంటి...పర్సా హెల్ప్ లైన్'' ఆధ్వర్యంలో మంగళవారం పౌష్ఠిక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సరళ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు మంచి వైద్యం అందిస్తుంటే హెల్ప్ లైన్ సేవలు కరోనా సోకిన వారికి మనో దైర్యాన్ని ఇస్తున్నాయన్నారు. కరోనా వైరస్ సోకిన వారి దగ్గరికి కుటుంబ సభ్యులే రాని పరిస్థితుల్లో మంచికంటి, పర్సా హెల్ప్ లైన్ సభ్యులు రోగులను పరామర్శించడం, వారికి తగిన సహయ సహకారాలు ఇవ్వటమే కాకుండా వారి ప్రాణాలకు తెగించి చనిపోయినవారి అంత్యక్రియలు చేయడం మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు. ప్రభుత్వం నుండి సరైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, లేకున్నా డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ వర్కర్ల కృషి చాలా అభినందనీయమన్నారు. మనో దైర్యం ద్వారానే కరోనాను జయించవచ్చని తెలిపారు. అలాంటి కృషి చేస్తున్న హెల్ప్ లైన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ కోవిడ్ ఇన్చార్జి డాక్టర్ రవిబాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, పొన్నం వేంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, హెల్ప్ లైన్ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు, జాటోత్ కృష్ణ, లిక్కీ బాలరాజు, భూక్యా రమేష్, సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, ఖాసిం, చంటి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.