Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తించిన భూమి హద్దులకు బౌండరీలు ఏర్పాటు చేయాలి
- తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు
నవతెలంగాణ-పాల్వంచ
వైద్య నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలన చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు కలెక్టర్ అనదీప్ తెలిపారు. మంగళ వారం పాల్వంచలో వైద్య నర్సింగ్ కళాశాల ఏర్పాటు కు మైనింగ్ కళాశాల వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు వైద్య నర్సింగ్ కళాశాల మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నా యని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య కళాశాల ఏర్పాటుకు 30 నుండి 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సూచించిన మేరకే మైనింగ్ కళాశాల పరిధిలోని సర్వే నెంబర్ 405లో గుర్తించిన స్థలంలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు తెలిపారు. గుర్తించిన భూములకు సంబంధించి మ్యాపులతో సహా ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు చెప్పారు. భూమికి హద్దులతోపాటు ప్లాగులు ఏర్పాటు చేసి బౌండరీలు విధించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. జిల్లా సౌలభ్యం కొరకు కొత్తగూడెం పాల్వంచ సమీపంలో ఈ కళాశాల ఏర్పాటుచేయడానికి స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. అనంతరం లకిëదేవిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు సర్వే నెంబర్ 1లోని భూములను పరిశీలించారు. రెవెన్యూ అటవీశాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి ట్రై జంక్షన్ గుర్తించి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో పంట ఉత్పత్తులు నిలువ చేసుకుని మద్ధతు ధర లభించినప్పుడు విక్రయాల నివారణకు వీలుగా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం వంద ఎకరాల సేకరణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోతహసీల్దార్ స్వామి, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.