Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు
- పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
- హత్యకు పాల్పడిన నలుగురి పై కేసు నమోదు : సీిఐ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మంత్రగాడు చేతబడులు చేస్తాడనే మూఢ నమ్మకంతో పాతమారేడుబాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య (65) అనే గిరిజనుడిని నలుగురు వ్యక్తులు హత్య చేశారని సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబందించి ఆయన హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేయడంతో పాటు వివరాలు వెల్లడించారు. పాత మారేడుబాక గ్రామానికి చెందిన మృతుడు కుంజా భీమయ్య భార్య మంగమ్మతో కలిసి వ్యవశాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గత నెల 12వ తేదీ అర్ధ రాత్రి నుండి కనిపించడం లేదని మృతుని కుమారుడు తిరుపతి అదే నెల 15వ తేదీన ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఇట్టి విషయమై తాము విచారణ చేస్తుండగా మంగళవా రం ఉదయం 6 గంటల సమయంలో కొత్తమా రడుబాక గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లకీëనారాయణ, తెల్లం రాజారావు, మిడియం శ్రీను అనే నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి కుంజా భీమయ్య గ్రామాల్లో మంత్రాలు చేత బడులు చేస్తాడని తెలిపారు. భీమయ్య చేతబడులు కారణంగా తెల్లం శ్రీను భార్యకు నాలుక మీద పుండ్లు అయ్యాయని, లకీëనారాయణ పెద్ద కుమారుడు రెండు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో చని పోయాడని, రాజ్‌కుమార్ తల్లికి చాలా రోజుల నుండి కాళ్లు చేతులు వాపులు వస్తున్నాయని, మిడియం శ్రీను వాళ్ల నాన్న ఏడాది క్రితం మృతి చెందాడని విచారణలో తెలిపినట్టు ఆయన తెలిపారు. గత నెల 12వ తేదీన పదకం ప్రకారం గ్రామంలో ఓ వివాహ కార్యక్రమానికి వచ్చిన భీమయ్యను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో గుడ్డ, తాడు సాయంతో మెడకు ఉరి వేసి చంపిన తర్వాత మోసుకుంటూ నర్సాపురం గ్రామ శివారులో గల గోదావరి నదిలోకి తీసుకు వెళ్లి శవాన్ని ఇసుకలో పూడ్చి వేశామని నిందితులు తెలిపినట్లు ఆయన తెలిపారు. వెంటనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని శవాన్ని పూడ్చిన ప్రదేశంకు వెళ్లి తహశీల్దార్ వర్షా రవికుమార్ సమక్షంలో గర్తు పట్టలేనంతగా ఉన్న కుళ్లి పోయిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్గం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఆయన తెలిపారు. ప్రజలు మూఢ నమ్మకాలతో ఇలాంటి సంఘటనలకు పాల్పడి జీవితాలను పాడు చేసుకోవద్దని అట్టి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. నిందితులను పోలీస్ స్టేషన్లో ప్రవేశ పెట్టిన వారిలో ఎస్ఐలు తిరుపతి, రవికుమార్ తదితరులు ఉన్నారు.