Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలుడికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-చర్ల
మండల పరిధిలో సత్యనారాయణపురం ఆర కొత్తగూడెం నడుమ ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ఢకొీని కలివేరు బట్టి గూడెం (రజబ్ అలీ) కాలనీకి చెందిన మడకం జోగయ్య (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కలివేరు ఇంటిదగ్గర నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఆర్ కొత్తగూడెం కారం మిల్లుకు వస్తుండగా కుదునూరు నుండి బయలుదేరిన పంచాయతీ ట్రాక్టర్ తప్పించే క్రమంలో వెనుక భాగంలో ఢకొీట్టింది. మడకం జోగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై ఉన్న అతని చిన్నా కుమారుడు మడకం సమ్మయ్యకు స్వల్ప గాయాలు కాగా బాబును హుటాహుటిన సత్యనారాయణ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సంఘటన తెలుసుకున్న చర్ల ఎస్ఐ వెంకటప్పయ్య ఘటనా స్థలానికి చేరుకొని సంఘటనను విచారణ చేసి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.