Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 57 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులో
- జిల్లా కలెక్టర్ డి.అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ డయాగస్టిక్స్ ఏర్పాటు వల్ల 57 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని జిల్ల కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ డయాగస్టిక్ హబ్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన రక్త నమూనాలను తెలంగాణ గయాగస్టిక్స్ నందు ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు తీసుకున్న వ్యక్తుల ఫోన్ నెంబర్లు రిజిష్టర్ చేయడం జరుగుతుందని, నమూనాలు పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధిత వైద్యాధికారికి, రక్త నమూనాలు ఇచ్చిన వ్యక్తి సెల్ ఫోన్‌కు సందేశం వెళుతుందని చెప్పారు. రక్త నమూనాలు సేకరణ తదుపరి తెలంగాణ డయాగస్టిక్స్ నందు బార్ కోడ్ ద్వారా సంబంధిత వ్యక్తుల వివరాలు నిక్షిప్తం చేయబడతాయని చెప్పారు. పేషెంట్ యొక్క నమోదు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బయోమెడికల్ వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. అనంతరం ల్యాబ్ నిర్వహణ, ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహణ తదితర అంశాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నారని చెప్పారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
పీపీ కిట్లు వితరణ కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి ప్యూర్ స్వచ్చంద సంస్థ తరుపున 1వేయి పిపిఈ కిట్లు, మాస్కులు, గ్లాజులు అందచేసిన డాక్టర్ పరికిబండ్ల అశోకును జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. మంగళవారం తెలంగాణ డయాగస్టిక్స్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేయడానికి ఆసుపత్రికి విచ్చేసిన కలెక్టరుకు డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఈ పరికరాలను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వైద్య సేవలు నిర్వహణకు ప్రజలకు ఉపయోగ పడే పరికరాలు అందచేయడం చాలా సంతోషమని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డిసిహెచ్ఎస్ ముక్కంటేశ్వరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సరళ, ఆర్ఐఓ డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.