Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవిందా పురం(ఏ) గ్రామానికి చేరిన రెండు లారీలు
- నవతెలంగాణ కథనం పట్ల రైతుల హర్షం
నవ తెలంగాణ- బోనకల్
గోవిందాపురం(ఎం) గ్రామ రైతుల ఆందోళన ఫలించింది. అధికారులు దిగివచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యపు బస్తాలను తరలించేందుకు ఆగమేఘాల మీద రెండు లారీలను పంపించారు.
మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో రైతుల వద్ద నుంచి ఇరవై రెండు వందల ధాన్యపు బస్తాలను కలకోట సహకార సంఘం 15 రోజుల క్రితం కొనుగోలు చేసింది. కానీ అక్కడ నుంచి ధాన్యపు బస్తాలను తరలించగా పోగా, ధాన్యపు బస్తాలను తరలించాలంటే అదనంగా 10 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులు మనస్థాపంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో ఎస్ఐ బి కొండలరావు సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే లారీలను పంపిస్తామని అక్కడ నుంచి ధాన్యపు బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సోమవారం సాయంత్రం ఒక లారీ మంగళవారం ఉదయం మరొక లారీ గోవిందాపురం ఏ గ్రామానికి చేరుకున్నాయి. ఒక లారీ ఆరు వందల ధాన్యపు బస్తాలను లోడ్ చేసుకుని వెళ్ళిపోగా, మరొక లారీలో ధాన్యం బస్తాలను లోడు చేస్తున్నారు. మరో రెండు లారీలు గోవిందపురం ఏ గ్రామానికి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, రైతులు తెలిపారు. దీంతో రైతుల ముఖంలో ఆనందం వ్యక్తమవుతుంది.
అనుమతి లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : సీఐ
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కరోనా వైరస్ ఉధృతిని అరికట్టే క్రమంలో ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ గ్రామాల్లో అనుమతిలేని మద్యం దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మధిర ఎక్సైజ్ సిఐ కె.నాగేశ్వర్ రావు, స్థానిక ఎస్ఐ ఉదయ కిరణ్, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణలు దుకాణదారులను హెచ్చరించారు. ఎర్రుపాలెం మండలం పరిధిలోని జమలాపురం గ్రామ పంచాయతీ నందు బెల్టుషాపు నిర్వాహకులతోను, కిరాణా షాపుల యజమానులతోను మాట్లాడారు అనుమతి లేని మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేయాలని, కిరాణా షాపులు ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించు కోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ చంద్రశేఖర్, ట్రైనింగ్ ఎస్సై శ్రవన్ కుమార్, స్థానిక సర్పంచ్ మూల్పూరి స్వప్న, ఎర్రుపాలెం సోసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్, దుకాణాదారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.