Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ- బోనకల్
రెండో దశ కరోనా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల లోనే వస్తుందని, దీనికి కారణం గ్రామీణ ప్రాంతాలలో గల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం కరోనా వ్యాధి పై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమల్ రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గ ప్రాంతం ఎక్కువగా ఆంధ్ర ప్రాంత గ్రామాలతో ఆనుకొని ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తుంన్నారు. దీనికితోడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఆధార్ లింక్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు. బెల్ట్ షాపులు ఉన్న గ్రామాలలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. బెల్టుషాపులను పూర్తిగా నిలిపి వేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మోటమర్రి, ఆళ్లపాడు, గార్లపాడు, చిన్న బీరవల్లి, రావినూతల గ్రామాలలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటానికి గల కారణాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న దష్ట్యా మీ-సేవ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులను కోరారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాలలో కరోనా కేసులు పెరుగుతు న్నాయన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాలలో కరోనా బాధితులు ఉండేవిధంగా పంచాయతీ కార్యదర్శులు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇంటి దగ్గర ఉంటూ ఐసోలేషన్ కేంద్రాల వద్ద భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్లడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అన్నారు. సమావేశంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం జడ్పిటిసి మోదుగు సుధీర్‌బాబు ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ డిప్యూటీ తాసిల్దారు సంగు శ్వేత బోనకల్ సర్పంచ్ భుక్యా సైదా నాయక్ బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.