Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజే, టెంట్‌హౌజ్ యాజమానులపై బైండవర్ కేసులు
నవతెలంగాణ-కారేపల్లి
కరోనా వ్యాప్తికి వ్యాప్తి కారణమవుతున్న వేడుకలపై పోలీసులు అధికారులు దృష్టిపెట్టారు. కారేపల్లి మండలంలో అధిక కరోనా కేసులు వేడుకల వలనే జరుగుతున్నాయి. వివాహ వేడుకలు మేకలతండాలో 24 కేసులు నమోదు కావటానికి కారణంగా కనిపిస్తుంది. దీంతో వేడుక ల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి మంగళ వారం మేకలతండా, దుబ్బతండా గ్రామాల్లో పర్యటించా రు. గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కరోనా బాధితులతో మాట్లాడారు. మేకలతండా ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
డీజే, టెంట్‌హౌజ్ యాజమానులపై బైండవర్ కేసులు
కారేపల్లి మండలంలో డీజే, డేకరేషన్, టెంట్‌హౌజ్ యాజమానులతో సమావేశమైన ఏసీపీ వెంకటరెడ్డి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వేడుకల సమాచారాన్ని ఎప్పటిక్పుడు అధికారులకు తెలియజేయాలని సూచించారు. డీజే, టెంట్‌హౌజ్ యాజమానుపై బైండోవర్ కేసులు నమోదు చేసి తహసీల్ధార్ ముందు హాజరపర్చారు. కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ బాణాల శ్రీనివాసులు, ఏస్సై పీ.సురేష్, వైద్యురాలు డాక్టర్ నెల్లూరి చందన, ఎంపీవో రామచంద్రరావు ఉన్నారు.