Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే కరోనా బాధితులు ఐసోలేషన్ కేంద్రాలకు వచ్చి వైద్యసేవలు పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్సైతాండ్ర నరేష్ బాధితులకు సూచించారు. మండలంలోని యడవల్లి, కట్టకూరు, ఖానాపురం గ్రామాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను మంగళవారం ఎస్సై తాండ్ర నరేష్ సందర్శించారు. ఈసందర్భంగా ఐసోలేషన్ కేంద్రాలలో ఉన్న కరోనా బాధితులతో మాట్లాడే వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు సమయాను కూలంగా కరోనా బాధితులకు వైద్యసేవలు అందించి భోజనం అల్పాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ పాలకవర్గం వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం ఎస్సై టి నరేష్ కరోనా బాధితుల ఇల్లుఇల్లు తిరిగి ఐసోలేషన్ కేంద్రాలకు రావాలని చెప్తూ కరోనాపై వారికి అవగాహన పెంపొందిస్తూ మనోధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి హర్షిదాబేగం, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, ఎంపిఓ పి.సూర్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ జాల ఏడుకొండలు, గ్రామసర్పంచులు చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి వెంకటరమణ, మాలోజి ఉష, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశాలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.