Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సీజినల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ వైద్య సిబ్బంది అప్రమత ్తంగా వుండాలని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో మోకాళ్ల వెంకటే శ్వర్లు అన్నారు. మంగళవారం మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని బాలాజీ నగర్లో దోమ తెరలు పంపిణీ చేసి, మాట్లా డారు. దోమ తెరల వాడకం వలన ప్రజలు విష జ్వరాల భారీన పడకుండా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, స్వర్ణలత, రాంప్రసాద్, యశోద, సుమ, శ్రావంతి, వార్డు మెంబర్లు తాత మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : వర్షాకాల సీజన్ ప్రారంభమైనందున గ్రామాల్లో డెంగ్యూ, మలేరియ సోకే అవకాశం ఉందని దీనిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంఎల్ఏ హరిప్రియ అన్నారు. మండలంలోని రొంపేడు పీహెచ్సీ పరిధిలోని మామిడి గూడెం గ్రామంలో హరిప్రియా దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సురేష్, సర్పంచ్ తాటి మౌనిక, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరి సింగ్ నాయక్, వైస్ ఎంపీపీ ప్రపమోద్, సబ్ యూనిట్ అధికారి భద్రు, ఉప సర్పంచ్ ప్రసన్న, పంచాయతీ సెక్రెటరీ తల్లారి శ్రీ బాబు, తదితరులు పాల్గొన్నారు.