Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కోవిడ్-19 రెండవ దశ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో భాదిత కుటుంబాలకు తామున్నామంటూ అమరజీవి యల మంచి సీతారామయ్య పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి ట్రస్టు సభ్యులు అందిస్తున్న సేవలు అభినందనీయ మని ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి కొనియాడారు. మంగళవారం వైఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అంజిబాక గ్రామంలో కరోనా భాదిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, గుడ్లు అందజేశారు. మొత్తం 26 కుటుంబాలకు ఎంపీడీఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి యలమంచి సీతారామయ్య పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు కరోనా భాదితులకు నిత్యవసరాలు అందజేస్తూ వారికి దైర్యం చెబుతా భరోసా కల్పించడం పట్ల సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ముత్యాలరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొర్సా చిలకమ్మ, యలమంచి వంశీకృష్ణ, పీఏసిఎస్ డైరెక్టర్ యలమంచి శ్రీనుబాబు, వ్యకాస మండల అధ్యక్షుడు ఉబ్బా సంపత్, సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, అంజిబాక సర్పంచ్ మడకం నాగేంద్రబాబు, బైరెడ్డి సతీష్, కొడిమి లక్ష్మయ్య, నర్సింహారావు, జంపన్న పాల్గొన్నారు.