Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఖమ్మం, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కొత్తగూడెం కోర్ట్ ప్రాంగణంలో జడ్జీలకు, న్యాయ శాఖ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మంగళవారం కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ అయిదవ అదనపు జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష, మొదటి అదనపు జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కే దీప, రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నీలిమ, గవర్నమెంట్ డాక్టర్స్ నాగేంద్ర ప్రసాద్, రాకేష్ కుమార్, నర్సులు, పద్మ, కోర్టు సూపర్డెంట్ రషీద్ అలీ ఖాన్, సత్యవతి, వెంకటేశ్వర్లు, డిప్యూటీ నాజర్ షరీఫ్, మొత్తం 123 వ్యాక్సిన్లు వేశారు.