Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు మంచి నారును అందించాలి
- అధిక దిగుబడులు సాధించడానికి నర్సరీలు కృషి చేయాలి
- జిల్లా కలెక్టర్ డి. అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులకు మంచి నారును అందించి, వారు అధిక దిగుబడులు సాధించడానికి నర్సరీల యాజమాన్యాలు కృషి చేయాలని, నకిలీ విత్తతనాలు విక్రయాలు చేస్తే వారిపై పిడీ యాక్డ్ నమోదుచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డి. అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి నర్సరీ నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 13 నర్సరీలు ద్వారా రైతులకు కూరగాయల సాగుకు నారు విక్రయాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఉద్యాన పంటలు సాగుకు అనుకూలమైన భూములున్నందున నర్సరీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నూతనంగా నర్సరీలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం అనుమతులు జారీ చేయాలని ఉద్యాన అధికారిని ఆదేశించారు. నర్సరీ నిర్వహణకు లైసెన్సులు పొందిన వ్యక్తులు మాత్రమే నారు విక్రయాలు చేపట్టాలని అనుమతి లేని వ్యక్తుల వద్ద నారు కొనుగోలు చేసి మోసపోవద్దని ఆయన సూచించారు.వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించిన రైతులతో పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ, ఉద్యాన అధికారులకు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన అధికారి మరియన్న, హెఓలు శాంత్రిప్రియ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.