Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటా వేసిన ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కాటా వేసిన ధాన్యాన్ని కల్లాలో నుంచి వెంటనే గోదాంలకు తరలించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కస్నాతండా, కాచిరాజు గూడెం, ఎం. వెంకటాయపాలెం, గోళ్లపాడు, ముత్తగూడెం కొనుగోలు కేంద్రాలను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ కల్లాలో ఉన్న ధాన్యం ఇప్పటికే తడిసి ముద్దై, మొలకలు వచ్చినా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతులును మోసం చేస్తున్న ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని లారీ యజమానులతో మాట్లాడి వెంటనే గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు పెరుమలపల్లి మోహన్ రావు, బందెల వెంకయ్య, పొన్నం వెంకటరమణ, ఊరుబండి చంద్రయ్య, భూక్య నాగేశ్వరరావు, గురవయ్య, తాటి వెంకటేశ్వర్లు, మద్ది వెంకట రెడ్డి, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.