Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం రూరల్
సీపీఎం పర్యవేక్షణలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్‌లోని నిర్మల్ హదరు స్కూల్లో నిర్వహిస్తున్న ఐసోలేషన్ సెంటర్‌కు బుధవారం పలువురు దాతలు నిత్యవసర వస్తువులు, డ్రై ఫ్రూట్స్ అందజేచేశారు. ఈ సందర్భంగా సిపిఎం చేస్తున్న సేవలను దాతలు కొనియాడారు. కరోనా లాంటి మహమ్మారి సోకితే కుటుంబ సభ్యులు కూడా భయపడే పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు సేవ చేయడం గొప్ప విషయం అన్నారు. ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వాసిరెడ్డి క్రాంతి దీపక్ (అమెరికా) ఐదు క్వింటాల బియ్యం అందజేశారు. ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు, ప్రముఖ డాక్టర్ బత్తినేని వెంకటేశ్వరరావు ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న రోగులకు ఒక రోజుకు సరిపడా ఫ్రూట్స్, ఎగ్స్ పంపిణీ చేశారు.
ఖమ్మం నగరంలోని బాలాజీ స్టోర్స్ అధినేత మేళ్లచెరువు కృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమణ నాలుగు వేల రూపాయల నిత్యావసర సరుకులను అందజేశారు.
ఖమ్మం నగరానికి చెందిన భూమా జగన్నాథం జ్ఞాపకార్ధం వారి కుమారులు నగేష్, రమేష్ వారి స్నేహితులు పది కిలోల డ్రై ఫ్రూట్స్ అందజేశారు.ఈ సందర్భంగా ఐసోలేషన్ సెంటర్‌కు నిత్యవసర వస్తువులు,పండ్లు,డ్రై ఫ్రూట్స్ అందజేసిన దాతలను బీవీకే జనరల్ మేనేజర్ వైయస్సార్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బీవీకే నిర్వాహకులు పాల్గొన్నారు.