Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం ఎంపీ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి, టిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ అత్త కొల్లి మహాలక్ష్మీ గుండెపోటుతో మృతి చెందడం పట్ల టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మంపార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. ఎంపీ నామ బుధవారం రాత్రి వైరా ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి మృతురాలి ంటికెళ్లి, ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. మృతురాలి కుమారులు కొల్లి జగన్మోహన్ రారు, కొల్లి మిత్రరారు, అల్లుళ్లు కనకమేడల సత్యనారాయణ, సూరపనేని శేషుకుమార్, కూతుళ్లను ఎంపీ నామ పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. మహాలక్ష్మీ ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మల స్కూల్ అధినేత సూరపనేని శేషుకుమార్, కిరణ్ గ్యాస్ అధినేత కొల్లి కిరణ్ , నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్, గోపీ తదితరులు పాల్గొన్నారు.