Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
కోవిడ్ బాధితుల సహాయార్థం ప్రారంభమైన బివికె ఐసొలేషన్ సెంటర్ నిర్వహణకు ఎస్ఎఫ్ఐ పూర్వ కార్యకర్తలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఖమ్మంనగరంలోని ఎన్ఎస్పి. క్యాంపులో గల బివికె ఐసొలేషన్ సెంటర్ కార్యక్రమాలను అభినందిస్తూ 35 వేల రూపాయలను బివికె ట్రస్టు చైర్మన్ పోతినేని సుదర్శన్‌రావు, జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావుకు బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పూర్వ కార్యకర్తల బాధ్యులు గోగినేని కిషోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ నిర్వహణకు సహాయం అందించిన ఎస్ఎఫ్ఐ. పూర్వ విద్యార్థులను అభినందించారు. ఐసొలేషన్ సెంటర్ నిర్వహణ కోసం అనేక మంది వ్యక్తులు, సంస్థలు సహకరిస్తున్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలతో పాటు, పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మనిషికి మనిషి తోడుగా నిలబడుతూ కరోనా బాధితులను, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ భరోసా ఇవ్వాలని కోరారు. ప్రస్తుత సంక్షోభ కాలంలో మానవత్వం వెల్లివిరియాలని, కష్టాలలో ఉన్న వారికి సహాయం అందించాలని తెలిపారు. ఈ కృషిలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం, తన వంతు పాత్రను నిర్వహిస్తోందని, అందుకు అనేక మంది సహకరిస్తున్నారని, వారందరికీ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో బివికె ట్రస్టు బాధ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బండి రమేష్, బుగ్గవీటి సరళ, ఎస్.ఎఫ్.ఐ. పూర్వ కార్యకర్తలు దామోదర్, విప్లవ్‌కుమార్, నవీన్, శ్రీదేవి, కీర్తి వెంకయ్య, జావీద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, వై. విక్రం, బండారు రమేష్, నందిపాటి మనోహర్, ఝాన్సీ, బివికె బాధ్యులు రామారావు, అఫ్జల్, శివన్నారాయణ, వాలంటీర్లు గిరి, సత్తెనపల్లి నరేష్, ఇంటూరి అశోక్, మాచర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.