Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
రైతులకు మోసం జరిగితే సహించేది లేదని ట్రైనీ ఐపీఎస్ స్నేహ మెహెరా అన్నారు. బుధవారం కారేపల్లి మండలం క్రాస్‌రోడ్, భజ్యాతండాలోని విత్తన దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ వివరాలు, వాటి అనుమతులను పరిశీలించారు. మిర్చి నర్సరీలలో మిర్చి నారు అమ్మకాల గురించి, నారు పోషణ వివరాలను ఏవో కే.ఉమామహేశ్వర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
కరోనాను ధైర్యంతో ఎదుర్కొవాలి
కోవిడ్ విపత్తు సమాజాన్ని పీడిస్తుందని దీనిని ధైర్యంతో ఎదుర్కొవాలని ఐపీఎస్ అధికారి స్నేహ మెహెరా అన్నారు. కరోనా ప్రభావిత గ్రామాలైన కొమ్ముగూడెం, ముత్యాలగూడెం గ్రామాలను సందర్శించారు. అధిక పాజిటీవ్ కేసుల నమోదు కారణాలను సర్పంచ్ కల్తిం భద్రమ్మ, కార్యదర్శి మాలోత్ భాస్కర్లను అడిగి తెలుసుకున్నారు. ఐపీఎస్ ఆధికారి వెంట సీఐ బీ.శ్రీనివాసులు, ఎస్సై పీ.సురేష్, తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఏవో కే.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంపీవో రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.